BRAOU B.ed programme 2024-25
డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను బీఈడీ ఓడీఎల్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల వారు అప్లై చేసుకునేందుకు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అర్హతలు
బీఈడీ కోర్సులో చేరేందుకు విద్యార్థులు డిగ్రీలో కనీసం 50శాతం మార్కులు కలిగి ఉండాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులై ఉండాలి. లేదా ప్రాథమిక విద్యలో టీచర్ ఎడ్యుకేషన్ పోగ్రాం పూర్తి చేసి ఉండాలి.
కోర్సు వ్యవధి రెండేళ్లు ఉంటుంది. తెలుగు మీడియంలో బోధన ఉంటుంది. అభ్యర్థులు ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేయబడతారు. ఎంపికైన అభ్యర్థులు రూ.40 వేలు ఫీజు చెల్లించాలి. ప్రవేశ పరీక్ష డిసెంబర్ 31న నిర్వహిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ 21
అప్లికేషన్ చేసేందుకు కింది లింక్ ఓపెన్ చేయండి.
https://myapplication.in/BRAOU/BRAOU/BRAOU_ApplicationForm.aspx1
BRAOU Bed Programme: డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఈడీ అడ్మిషన్లు