Trending Posts

TG New ration cards List: తెలంగాణ కొత్త రేషన్​ కార్డుల జాబితా సిద్ధం!

NEW RATION CARDS APPLY

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎట్టకేలకు కొత్త రేషన్​ కార్డులకు అర్హులైన వారి జాబితాను new ration cards list సిద్ధం చేసింది. ఈ మేరకు కొత్త రేషన్​ కార్డుల మార్గదర్శకాలు విడుదల చేసిన లిస్ట్​ను కలెక్టర్లకు పంపింది.

తెలంగాణాలో గత 10 ఏండ్లుగా కొత్త రేషన్​ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం కొత్త రేషన్​ కార్డులపై దృష్టిపెట్టకపోవడంతో ఏండ్లుగా కొత్త రేషన్​ కార్డుల ప్రక్రియ నిలిచిపోయింది. గతేడాది డిసెంబర్​లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ సర్కారు మొదటి మూడు ప్రాధాన్యత అంశాల్లో కొత్త రేషన్​ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించింది.

ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నెలలోనే ప్రజాపాలన దరఖాస్తులతో పాటు కొత్త రేషన్​ కార్డుల దరఖాస్తులను new ration cards apply తీసుకుంది. వీటిని ఆన్లైన్​ చేయడంతో పాటు ఇటీవల సమగ్ర కుటుంబ కుల సర్వేను నిర్వహించింది. ఇందులోనూ రేషన్​ కార్డుల లేని వారి వివరాలను సేకరించింది.

అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సమగ్ర కుల సర్వే SAMAGRA KULA SURVEY ఆధారంగానే రేషన్​ కార్డులు లేని వారి జాబితాను సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ జాబితాను హైదరాబాద్​ పరిధిలో జీహెచ్​ఎంసీ కమిషనర్​కు మిగతా జిల్లాల పరిధిలో కలెక్టర్లకు పంపించింది.

ఈ మేరకు జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల పరిధిలో మండలాలు, గ్రామాల్లో అర్హులైన ఎంపిక జాబితాను ప్రదర్శిస్తారు. అనంతరం వాటిలో ఏవైన సవరణలు ఉంటే స్వీకరిస్తారు. వీటితో పాటు పాత కార్డుల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఎట్టకేలకు కొత్త రేషన్​ కార్డుల జాబితా స్పష్టత వచ్చింది. ఎవరైతే ప్రజాపాలన లేదా సమగ్ర కుల సర్వేలో రేషన్​ కార్డు లేదని వివరాలు సమర్పించారో వారికి కొత్త రేషన్​ కార్డుల అందిస్తారు. ఒకవేళ ఎవరైనా రేషన్​ కార్డుపై సమగ్ర కుల సర్వేలో వివరాలు సమర్పించకపోతే ఎంపీడీవో లేదా తహసీల్దార్​ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది.

గ్రామ సభలు లేదా గ్రామపంచాయతీ ఫీల్డ్​ సర్వే అనంతరం జవవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త రేషన్​ కార్డులు అందించనున్నారు. కొత్త రేషన్​ కార్డులుNEW RATION CARDS పూర్తి డిటిటల్​ రూపుతో రానున్నాయి. ఇందులో కుటుంబ యజమాని పేరుతో మాత్రామే జారీ చేయనున్నారు. పూర్తి సాంకేతిక పరిజ్క్షానంతో అందించే ఈ రేషన్​ కార్డు ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు రేషన్​ సరుకులు అందించనుంది.

TG New ration cards List: తెలంగాణ కొత్త రేషన్​ కార్డుల జాబితా సిద్ధం!

Leave a Comment