tgedcet-2025
తెలంగాణాలో బీఈడీ కోర్సులో 2025–26 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం ఎడ్‌సెట్ 2025 షెడ్యూల్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 12 నుంచి మే 13 వరకు కొనసాగనుంది.
ఎడ్‌సెట్ ప్రవేశాల కోసం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మార్చి 10 న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ ఏడాది ఎడ్‌సెట్ పరీక్ష కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనుంది. ఎడ్‌సెట్ పరీక్షను జూన్ 01న నిర్వహించనున్నారు.
ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తారు. టీచర్‌గా స్థిరపడాలనుకునే వారు ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా బీఈడీలో చేరవచ్చు. ఈ కోర్సు రెండేళ్ల పాటు నాలుగు సెమిస్టర్లుగా ఉంటుంది.