Trending Posts

JOB MELA IN VIZAG: నిరుద్యోగులకు గుడ్​న్యూస్​..మెగా జాబ్​మేళా

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. విశాఖపట్నంలో ప్రముఖ ఐటీ, నాన్​ ఐటీ కంపెనీలో జూలై 19న మెగా జాబ్​(job mela)మేళా నిర్వహించనున్నాయి. 18–30 ఏళ్ల వయసుగల నిరుద్యోగ అభ్యర్థులు తమ అర్హతల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియకు హాజరుకావచ్చు. పూర్తి వివరాలు..

టెన్త్​ క్లాస్, ఇంటర్​, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీటెక్​, తదితర ఉత్తీర్ణత కలిగిన నిరుద్యోగులు ఈ జాబ్​మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు వెంటనే ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఉద్యోగ మేళాలో పాల్గొనే అభ్యర్థులు స్పాట్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని తెలిపారు.

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఈ నెల 19న డాటా ప్రో, ద్వారాకానగర్​ క్యాంపస్​లో ప్రత్యేక మెగా జాబ్​మేళా నిర్వహిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్​లు ప్రకటన విడుదల చేశారు. డాటా ప్రో 35వ వార్షికోత్సవం సందర్భంగా ఈ జాబ్​మేళా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

అపోలో ఫార్మసీ, వరుణ్​ మోటార్స్​, కియా మోటార్స్​, విజన్​ ఇండియా, టెక్​ మహింద్రా, మిరాకిల్​ సాఫ్ట్​వేర్​ సిస్టమ్స్​, డెక్కన్​, డైకిన్​, హ్యూండాయ్​, జోస్ట్​ తదితర కంపెనీలో తమ సంస్థలలో అర్హత కలిగిన అభ్యర్థులను పలు ఉద్యోగాలకు ఎంపిక చేసుకునేందుకు ఈ జాబ్​లో ప్రాతినిధ్యం వహించనున్నాయి.

JOB MELA IN VIZAG: నిరుద్యోగులకు గుడ్​న్యూస్​..మెగా జాబ్​మేళా

Leave a Comment