Telangana Teacher eligibility test july 2025 resultsతెలంగాణాలో ఇటీవల నిర్వహించిన తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ TG TET 2025 ఫలితాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ జులై 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

జూన్ 18 నుంచి 30 వరకు తొమ్మిది రోజుల టెట్ పరీక్షను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించారు మొత్తం 16 సెషన్లలో టెట్ పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు నిర్వహించగా..పేపర్ 1 కు 63,261 మంది దరఖాస్తు చేసుకుంటే 47,224, పేపర్ 2కు 66, 686 మంది దరఖాస్తు చేసుకుంటే 48 998 మంది హాజరయ్యారు.
పరీక్ష అనంతరం టెట్ ప్రైమరీ కీని విడుదల చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. దీనిని అనుగుణంగా ఫైనల్ కీని సిద్ధం చేసి టెట్ రిజల్ట్స్ ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రక్రియ పూర్తైంది. సోమవారం బోనాల పండుగ సెలవు కావడంతో మంగళవారం టెట్ ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
Telangana Teacher eligibility test july 2025 results
ఫలితాల కోసం https://tgtet.aptonline.in/tgtet/ వెబ్సైట్ను సంప్రదించవచ్చు.