Telangana New Ration cards
కొత్తరేషన్ కార్డు దారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా రేషన్‌కార్డు పొందిన లబ్దిదారులకు ప్రభుత్వం అధికారికంగా జూలై 25వతేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.
మీ కొత్త రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి…
Downloadclick foe new ration card
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా గ్రామసభలు, మీసేవా ద్వారా కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.. కాగా ఇప్పటి వరకు సుమారు 7లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. వీటితో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 90లక్షలకు పైగా రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
జూలై 25వతేదీ నుంచి మండలాల వారీగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. మండల పరిధిలో ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
కొత్త రేషన్‌కార్డు నమూనా ఇలా.
telangana new ration card model
కొత్త రేషన్‌కార్డుపై లబ్దిదారుని ఫోటోతో పాటు ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలు, తెలంగాణ రాజముద్రతో రేషన్‌కార్డు నంబర్, లబ్దిదారుని వివరాలు ఉంటాయి.
