Trending Posts

DUSSEHRA HOLIDAYS: దసరా సెలవులు రీ షెడ్యూల్ విడుదల

విద్యార్థులకు గుడ్ న్యూస్ . దసరా సెలవుల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్2 వరకు సెలవులు ఇవ్వగా మరో రెండు రోజులు పెంచారు.

ఈ మేరకు దసరా సెలవుల్ని మరో రెండు రోజులు పెంచారు.. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ‘పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాము’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

dussehra holidays
dussehra holidays


వాస్తవానికి ఏపీ ప్రభుత్వ దసరా సెలవుల్ని ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు (9 రోజులు) మాత్రమే ఇచ్చింది. అయితే పలువురు ఎమ్మెల్సీలు మంత్రి నారా లోకేష్‌కు లేఖ రాశారు. స్కూల్ విద్యార్థులకు ఈ నెల 22 నుంచి సెలవులు ఇవ్వాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు (11 రోజులు) దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ నెల 21 ఆదివారం కావడంతో.. ఆ రోజు నుంచే పిల్లల స్కూళ్లకు సెలవులు ప్రారంభమవుతాయి. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 2 వరకు 12 రోజుల పాటూ సెలవులు వచ్చినట్లు లెక్క.

రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగాలా.. చంద్రబాబు సీరియస్
తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవుల్ని ప్రకటించారు. అక్కడ మొత్తం 13 రోజుల పాటూ దసరా సెలవులు ఇచ్చారు. అంటే అక్టోబర్ 4 నుంచి స్కూల్స్ ప్రారంభమవుతాయి. అలాగే అక్టోబర్ 2న దసరా పండుగ వచ్చింది.. అయితే అదే రోజు గాంధీ జయంతి కూడా ఉంది. అంటే ఈసారి గాంధీ జయంతి సెలవు దినం దసరాతో కలిసి రావడంతో పిల్లలు ఒక సెలవును మిస్ అయ్యారని చెప్పాలి. మొత్తం మీద ఈసారి తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దసరా సెలవులు చాలానే ఇచ్చారు.. ఇంకేముంది ఫుల్ ఎంజాయ్.

Leave a Comment