Trending Posts

MPTC, ZPTC Nomination Documents ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్​కు అవసరమయ్యే పత్రాలివే..

తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైంది. నేటి నుంచి 11వతేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన, 15వరకు ఉపసంహరణ చేసుకునే అవకాశం కల్పించారు. ఫస్ట్​ ఫేజ్​లో విడుదల చేసిన నోటిఫికేషన్​కు అక్టోబర్​ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్​ జరగనుంది. నవంబర్​ 11న ఓట్ల లెక్కింపు ఫలితాలను విడుదల చేస్తారు.

‘నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలివే’

1) వయస్సు 21 సంవత్సరాలు నిండాలి
2) మీ ఏరియాలో ఓటరు లిస్టులో ఓటరు గా నమోదై ఉండాలి.
3)SC/ST/BC వారైతే caste certificate జత పరచాలి.
4) ఎన్నికల కమిషన్​ నిర్ధేశించిన డిపాజిట్ చెల్లించాలి
5)నేర చరిత్ర,చర, స్తిర ఆస్తులు, విద్యార్హత లతో కూడిన అఫిడవిటీ ఇద్దరు సాక్ష్యాలతో సంతకం పెట్టించి ఇవ్వాలి.
6) ఎలక్షన్ expenditure maintain చేస్తానని declaration ఇవ్వాలి.
7) ఏ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారో నామినేషన్ పత్రంలో ముందే తెలపాలి, లేకపోతే పార్టీ B పారం ఇచ్చిన పార్టీ గుర్తు రాదు.
8) నామినేషన్ పత్రం లో ఎన్ని పార్టీ పేర్లైన రాయొచ్చు. ఏ పార్టీ B పారం ఇవ్వకపోతే స్వతంత్ర గుర్తు కేటాయిస్తారు.
9)ఏదైతే స్థానం నుంచి పోటి చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటరు మాత్రమే ప్రతిపాదకుడుగా ఉండాలి.
10) నామినేషన్ పత్రం లో:
A)PART1 లొ ప్రతిపాదకుని సంతకం ఉండాలి
B)PART 2 లో అభ్యర్ధి సంతకం ఉండాలి.
C)PART 3 లొ కూడా అభ్యర్ధి సంతకం ఉండాలి.
D)PART 4 లో RO సంతకం ఉండాలి
E)PART 5(Rejected nominations reasons)లొ RO సంతకం ఉండాలి.
F)PART 6 (receipt ) లొ RO సంతకం ఉండాలి.
11) అఫిడవిటీ లో ఇద్దరు సాక్షుల సంతకం మరియు అభ్యర్థి సంతకం ఉండాలీ.
12.Expenditure Declaration లో అభ్యర్థి సంతకం ఉండాలి.

Leave a Comment