Yalla krishnaveni-Pay Pal
ఇన్స్ట్రాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మాధ్యమాల్లో రీల్స్ చేస్తూ… లక్షల్లో వ్యూస్, లైకులు కోసం ఆరాటపడుతున్న నేటి యువతరంలో….రూ.34లక్షల వేతనంతో ఉద్యోగానికి ఎంపికైంది ఓ యువతి. తండ్రి నెలకు రూ.15వేల వేతనం కోసం పడుతున్న కష్టాలను చూడలేకపోయింది. తమ కుటుంబాన్ని ఉన్నత స్థానంలో చూడాలనుకుంది. ఇందుకు చదువునే ఆయుధంగా చేసుకుంది. విజయం సాధించింది. ఆమే…. హుజురాబాద్ పట్టణానికి చెందిన యాల్ల కృష్టవేణి.
హన్మకొండలోని ఎస్సార్ కాలేజీలో సీఎస్ఈలో బీటెక్ పూర్తి చేసిన కృష్ణవేణి కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నైపుణ్యాలను నేర్చుకుంది. చాట్జీపీటీలోనే ప్రతిభ చూపి మూడు నెలల పెయిడ్ ఇంటర్న్షిప్ అవకాశం దక్కించుకుంది. అనంతరం జరిగి క్యాంపస్ ఇంటర్వ్యూలో పే పాల్ pay Pal కంపెనీలో రూ.34.40 లక్షల వార్షిక వేతనానికి ఎంపికైంది. సగటున నెలకు 2.86 లక్షల జీతం.
ఎంత కష్టమైన కష్టపడితే కచ్చితంగా విజయం సాధించవచ్చని, పేదరికం చదువుకునేందుకు అడ్డు కాదని నిరూపించిన కృష్ణవేణి ‘యువత సెల్ఫోన్లో రీల్స్ చూస్తు సమయం వృథా చేయకుండా.. అదే సమయాన్ని చదువుపై శ్రద్ధపెడితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని యువతకు స్ఫూర్తి నింపుతోంది. ఇద్దరమ్మాయిలే.. ఎలా నెట్టుకొస్తామో.. అనే భావనతో ఉన్న తల్లిదండ్రులకు పెద్ద దిక్కుగా మారింది. కంగ్రాచ్యులేషన్స్ కృష్ణవేణి.
Yalla krishnaveni placed at pay pal with 34.4 lack incom: తండ్రి సంపాదన రూ.15వేలు.. బిడ్డ జీతం రూ.34 లక్షలు