ప్రస్తుత కాలంలో చాలా మంది 30ఏళ్ల వయసు దాటితే చాలు పెళ్లి, పిల్లలు అంటూ ఏదో ఉద్యోగం చేస్తూ… చదవును పక్కన పెడుతున్నారు. కానీ ఈయన 80 ఏళ్ల వయసు దాటినా… చదువుకు వయోభారం అడ్డంకి కాదంటూ ఇప్పటికే 20 పీజీలు పూర్తి చేశారు. అంతే కాకుండా సొంత స్కూలు పెట్టి ఎంతో మందికి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు. ప్రాచీన కళలు, సంస్కృతి, దేశభక్తి, బుర్ర కథ, అవయవ దానం ఎయిడ్స్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ.. ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు.. ఆయనే వరంగల్‌కు చెందిన వీరస్వామి.
1944 నవంబర్ 3న జన్మించిన అంకతి వీరస్వామి . 1968లో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి వరంగల్ లోని ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1973లో దూరవిద్య ద్వారా బిఏ చేశారు. 1978లో బీఈడీ పూర్తి చేశారు.
1981లో హిమాచల్ ప్రదేశ్ లో ఏంఈడీ చేస్తున్న సమయంలో ఓ ప్రొఫెసర్ మూడు పీజీలు పూర్తి చేయడం చూసి స్ఫూర్తి పొందిన వీరస్వామి హానర్ నుంచి దూరవిద్య ద్వారా వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీలు చేస్తూనే ఉన్నారు. వివిధ కోర్సులో ఇప్పటివరకు 20 పీజీలు పూర్తి చేశారు.
కాకతీయ యూనివర్సిటీలో 7, ఉస్మానియా యూనివర్సిటీలో 3, ఇందిరా గాంధీ యూనివర్సిటీ 4, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ 3, పలు యూనివర్సిటీల నుంచి మరో 3 పీజీలు పూర్తి చేశారు. అయినా ఇక్కడితో తన చదువు ఆపలేదు. ప్రస్తుతం ఇగ్నో యూనివర్సిటీలో ఎంఏ ఆంత్రోపాలజీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మరో నాలుగు పీజీలు చదివి మొత్తం 25 పీజీలు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వీరస్వామి తెలిపారు.
Post grduate old Man: వయసు ఎనబై.. పీజీలు ఇరవై