ఇంటర్ క్వాలిఫికేషన్ తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించే అవకాశాన్ని స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్ సీ) కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్ మెంట్లలలో ఖాళీగా స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నోటిఫికేషన్ వివరాలు
సెంట్రల్ మినిస్ట్రీ డిపార్ట్ మెంట్లలోని 2,006 స్టెనో గ్రాఫర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంటర్ పాసై, స్టెనో గ్రఫీ/ షార్ట్ హాండ్ లో నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు వివరాలు
ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 18వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. మహిళలు, వికలాంగులు, ఎక్స్- సర్వీస్ మెన్స్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఎలాంటి ఫీజూ లేదు. మిగిలిన కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులకు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -సీ, గ్రేడ్ -డీ ఎగ్జామినేషన్ 2024 కు అప్లయ్ చేసుకున్న అభ్యర్థులను రెండు దశల్లో ఎంపిక చేస్తారు. మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. తరువాత వారిలోని స్టెనో గ్రఫీ/ షార్ట్ హ్యాండ్ నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ రెండు టెస్ట్ లో ప్రతిభ కనబర్చిన వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం
మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటిలిజెన్స్, రీజనింగ్ కు 50 మార్కులు, జనరల్ అవేర్ నెస్ కు 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కాంఫ్రెన్షన్ కు 100 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్క్ కోత విధిస్తారు. అభ్యర్థులు 2 గంటల్లో ఈ 200 మార్కలకు సమాధానలు గుర్తించాల్సి ఉంటుంది. స్కిల్స్ టెస్ట్ కు అభ్యర్థి అప్లయ్ చేసుకున్న గ్రేడ్ కేటగిరి ఆధారంగా టైమ్ కేటాయిస్తారు.
పరీక్క్షా కేంద్రాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో మాత్రమే పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అందులో తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, తిరుపతి, రాజమండ్రిలు ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ ఏడాది అక్టోబర్ / నవంబర్ లో నిర్వహిస్తామని ఎస్ఎస్ సీ పేర్కొంది.
మరిన్ని వివరాలకు
https://ssc.gov.in/ వెబ్సైట్ సంప్రదించండి
staff selection commission 2024: స్టెనో గ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.