TG Lawcet counceling 2024
TG lawcet 2024 counselling : తెలంగాణ లాసెట్ -2024 (TG lawcet 2024 counselling process) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. టీజీ లాసెట్ అధికారిక వెబ్ సైట్ లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మూడేళ్ల / ఐదేళ్ల లాసెట్, అలాగే రెండేళ్లు ఉండే ఎల్ఎల్ఎం కోసం అభ్యర్థులే సొంతంగా ఇంటి నుంచే సులభంగా దీనికి అప్లయ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలా చేయాలో పూర్తి వివరాలు మీకోసం..
కావాల్సిన సర్టిఫికెట్లు..
- పదో తరగతి మెమో
- పదో తరగతి స్టడీ సర్టిఫికెట్లు (బోనోఫైడ్ )
- ఇంటర్ మీడియట్ మెమో
- ఇంటర్ మీడియట్ స్టడీ సర్టిఫికెట్లు (బోనోఫైడ్)
- డిగ్రీ కన్సాలిడేటెడ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ (సీఎన్ఎన్)
- డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికెట్
- డిగ్రీ స్టడీ సర్టిఫికెట్ (బోనోఫైడ్)
- పెరెంటల్ ఇన్ కమ్ సర్టిఫికెట్
- కమ్యూనిటీ సర్టిఫికెట్ (క్యాస్ట్ సర్టిఫికెట్)
- ఆధార్ కార్డు
- టీజీ లాసెట్ ర్యాంక్ కార్డు
- ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ (టీసీ)
ముఖ్య వివరాలు
సాధారణంగా ఏదైనా కోర్సులో ప్రవేశానికి ఫిజికల్ గా సర్టిఫికేషన్ నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు ఆన్ లైన్ ద్వారా వెబ్ ఆప్షన్ సౌకర్యం కల్పిస్తారు. కానీ అభ్యర్థుల సౌకర్యార్థం గత కొన్నేళ్లుగా టీఎజీ లా సెట్ ఆన్ లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తోంది. అయితే కొన్ని స్పెషల్ సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులు అంటే ఎన్ సీసీ, స్పోర్ట్స్, పీడబ్ల్యూడీ సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులు ఫిజికల్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కౌన్సిలింగ్ ప్రాసెస్..
కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్న అభ్యర్థులు ముందుగా https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ ద్వారా తమ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డుతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీని వెరిఫికేషన్ చేసుకోవాలి. తరువాత ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ, క్రెడిట్ /డెబిట్ కార్దు ద్వారా కౌన్సిలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మొదటి స్టెప్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అందులో పెరెంటల్ ఇన్ కమ్ డీటెయిల్స్, మైనారిటీ లేదా నాన్ మైనారిటీకి చెందిన అభ్యర్థ్యా ? కాదా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే స్టెప్ లో లాగిన్ పాస్ వర్డ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్ వర్డ్ ను అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కౌన్సిలింగ్ ప్రక్రియ మధ్యలో ఆగిపోయినా.. వివిధ కారణాల వల్ల అభ్యర్థి కొంత సమయం తరువాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ను కంప్లీట్ చేసుకోవాలనుకున్న ఈ పాస్ వర్డ్ తోనే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
రెండో స్టెప్ లో ముందుగానే స్కాన్ చేసి పెట్టుకున్న టెన్త్ క్లాస్ మెమో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్ నెంబర్, సర్టిఫికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. బోనో ఫైడ్ ను అప్ లోడ్ చేయాలి.
మూడో స్టెప్ లో ఇంటర్ మెమో, బోనో ఫైడ్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి. ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, మెమో నెంబర్ ఎంటర్ చేయాలి.
నాలుగో స్టెప్ లో డిగ్రీ, బోనో ఫైడ్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి. అలాగే డిగ్రీ సర్టిఫికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఐదో స్టెప్ లో స్టెప్ లో సోషల్ కెటగిరీని సెలెక్ట్ చేసుకొని, తహసీల్దార్ జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్ ను ఆప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆరో స్టెప్ లో పేరెంటల్ ఇన్ కమ్ స్టేటస్ ను సెలెక్ట్ చేసుకొని తహసీల్దార్ జారీ చేసిన ఇన్ కమ్ సర్టిఫికెట్ ను ఆప్ లోడ్ చేయాలి. అందులోనే అభ్యర్థి ఆధార్ కార్డును కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
తరువాత సెల్ప్ డిక్లరేషన్ పై టిక్ చేసి, టర్మ్స్ అండ్ కండీషన్స్ ను యాక్సెప్ట్ చేయాలి. మళ్లీ ఒక సారి డిటెయిల్స్ అన్నీ చెక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తరువాత స్క్రీన్ పై సర్టిఫికెట్లు సబ్మిట్ అయినట్టు చూపిస్తుంది. అభ్యర్థి కమ్యూనిటినీ ఆయా డిపార్ట్ మెంట్ అధికారులు వెరిఫై చేయాల్సి ఉంటుంది. వాళ్లు వెరిఫై చేసిన తరువాత అభ్యర్థి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాడనికి అనుమతి ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు
కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం : 05.08.2024
సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకునేందుకు చివరి తేదీ : 20.08.2024
మొదటి దశ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ: 22.8.2024 – 23.08.2024
వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్ : 24.08.2024
సెలెక్ట్ అయిన అభ్యర్థుల లిస్ట్ డిస్ ప్లే : 27.08.2024
సీటు లభించిన అభ్యర్థులు 28,29,30 తేదీల్లో ఒరిజనల్ సర్టిఫికెట్లతో ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఆఫీషియల్ వెబ్ సైట్ : https://lawcet.tsche.ac.in/