ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో 16,347 పోస్టుల కోసం త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియ చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
ఏపీలో చాలా రోజులు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోస్టుల ప్రకటన, సిలబస్, జిల్లాల వారీగా ఖాళీలపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియ మాత్రం ప్రారంభించలేదు. పరీక్షల షెడ్యూల్ను కూడా విడుదల చేయాల్సి ఉంది. అయితే మెగా డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏ ప్రభుత్వంలో అయినా.. రాత్రిలోనే ఏ కార్యక్రమం సాధ్యం కాదని కొంత సమయం పడుతుందని అన్నారు.
గత ప్రభుత్వ అసమర్ధత వల్ల పాలన గాడితప్పిందని వాటిని సరిచేసుకుంటూ పోతున్నామని చెప్పారు. ప్రతి అంశంపై ప్రజలకు స్పష్టత ఇస్తామని అన్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున.. అవి పూర్తయిన వెంటనే 16, 347 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చెందవద్దని ప్రిపరేషన్ కొనసాగించాలని కోరారు. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని తెలిపారు.
డీఎస్సీ నోటిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణతోపాటు ఇతర శాఖల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు.
AP MEGA DSC NOTIFICATION: ఏపీలో 16,347 పోస్టులకు దరఖాస్తులు..సీఎం కీలక ప్రకటన