Trending Posts

APPSC: ఏపీపీఎస్సీ–691 ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​ పోస్టులు ఖాళీలు

APPSC FOREST BEAT OFFICER 691 POSTS NOTIFICATION RLEASED

ఆంధ్రప్రదేశ్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (appsc) అటవీ శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 691 పోస్టులకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఇందులో ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​ (FBO) 256 పోస్టులు, అసిస్టెంట్​ బీట్​ ఆఫీసర్​ పోస్టులు( ABO) 435 పోస్టులు ఖాళృగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు జూలై 16 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్​ పూర్తి వివరాలు

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియేట్​ రెగ్యూలర్​, లేదా ఒకేషనల్​ కోర్సు పూర్తి చేసి ఉండాలి. పోస్టులకు అనుగుణంగా శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. పురుషులు 163 సెం.మీ ఎత్తు, మహిళలు 150 సెం.మీ ఎత్తు మరియు ప్రామాణిక శారీరక కొలతలు కలిగి ఉండాలి. ఎన్​సీసీ సర్టిఫికేట్​ ఉంటే బోనస్​ మార్కులు కలుపుతారు.

ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​, అసిస్టెంట్​ ఆఫీసర్​ పోస్టులకు అభ్యర్థులు జూలై 01 2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5ఏండ్ల వయో సడలింపు ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్​

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​, అసిస్టెంట్​ బీట్​ఆఫీసర్​ పోస్టులకు నిర్దేశించిన సిలబస్​తో స్క్రినింగ్​ టెస్ట్​ నిర్వహిస్తారు. అనంతరం మెడికల్​ టెస్ట్​, కంప్యూటర్​ నాలెడ్జ్​ టెస్ట్​ నిర్వహించి మెరిట్​ ఆధారంగా సెలెక్షన్​ చేస్తారు. తుది దశలో ఎంపికైన వారికి ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​కు రూ. 25, 220–రూ. 80, 910, అసిస్టెంట్​ బీట్​ ఆఫీసర్​కు రూ. 23,120, 74, 770 జీత భత్యాలు చెల్లిస్తారు

దరఖాస్తు ప్రక్రియ

అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా రూ. 330 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి ఏపీపీఎస్సీ వెబ్​సైట్​ http://(https://psc.ap.gov.in/లో ఆన్​లైన్​ దరఖాస్తు ఫారం అందుబాటులోఉంటుంది. దరఖాస్తులు జూలై 16 నుంచి ప్రారంభం అయ్యాయి. ఆగస్టు 05వతేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

అధికారిక నోటిఫికేషన్​ పూర్తి వివరాలు

Leave a Comment