Bank jobs notification
దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచుల్లో(Bank of Baroda) లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO)ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్ట్ 03వతేది వరకు గడువు ఉంది.
అర్హతలు
బ్యాంక్ ఆఫ్ బరోడా లోక్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. వృత్తిపరంగా చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ ఇంజినీరింగ్ ,ఇంజినీరింగ్ మెడికల్ పూర్తి చేసి ఉండాలి. కమర్సియల్ లేదా రీజినల్ బ్యాంక్‌లో ఏడాది పాటు బ్యాంకింగ్ అనుభవం ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్, సైకో మెట్రిక్ టెస్ట్, లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్‌లో బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ ఆవేర్నెస్, రీజినింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద ప్రశ్నలుంటాయి..
అప్లికేషన్ ప్రాసెస్
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టట్ 03వతేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175 ఫీజు ఉంటుంది. పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా, ముంబాయి, బెంగుళూర్లో ఉంటాయి
https://www.bankofbaroda.in/career/current-opportunities
(నోట్ అభ్యర్థులకు కనీసం 680 సిబిల్ స్కోర్ ఉండాలి.)