Film Direction course
తెలుగు విశ్వవిద్యాలయం 2025–2028 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా ఇన్ మ్యాజిక్, డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు జూలై 30లోగా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ హనుమంతారావు తెలిపారు.
మ్యాజిక్ (Magic) కోర్సుల్లో చేరేందుకు కోఆర్డినేటర్ సామలవేణు (9059794553), ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులకు డా. రాజు (834646773) ను సంప్రదించాలని తెలిపారు. నటన, మ్యాజిక్ ఆర్ట్‌పై ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నాంపల్లి ప్రాంగణంలో శిక్షణ అందిస్తారు.