Trending Posts

Formula E Car Race case: ktr arrest?: ఫార్ములా ఈ కార్​ రేస్​ కేసులో…బిగ్​ అప్​డేట్​

Formula E Car Race case

ఫార్ముల్ ఈ- రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌పై కూడా కేసు నమోదైంది. కేటీఆర్‌ మీద మొత్తం నాలుగు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టింది ఏసీబీ. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్‌ రెడ్డిని ఏసీబీ పేర్కొంది.

KTR Case Updates: Formula E Car Raceలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. 13(1)A, 13(2) పీసీ యాక్ట్ కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వీటితో పాటు 409, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.

ఇందులో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టుకు అధికారులు ఎఫ్ఐఆర్ కాపీని సమర్పించారు. మాజీ మంత్రి కేటీఆర్ మీద పీసీ యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు.

ఆర్బీఐ నిబంధనలకు విరుద్దంగా ఓ విదేశీ సంస్థకు నిధుల బదలాయింపు జరిగిందని ప్రధాన అభియోగంగా తెలిపినట్టు సమాచారం. కేబినెట్ ఆమోదం లేకుండా మంత్రిగా ఉన్న కేటీఆర్ తన సొంత నిర్ణయంతో హెచ్ఎండీఏ బోర్డు నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదలాయించినట్టు సమాచారం.

Formula E Car Race case: ktr arrest?: ఫార్ములా ఈ కార్​ రేస్​ కేసులో…బిగ్​ అప్​డేట్​

Leave a Comment