HDFC Scholarship 2025
విద్యలో ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వారు పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్’ ద్వారా రూ.75వేల స్కాలర్షిప్ అందిస్తున్నారు. ఈ స్కాలర్షిప్కు 1వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు.. అప్లై చేసేందుకు సెప్టెంబర్ 4 చివరి తేదీ… పూర్తి వివరాలు…

పేద విద్యార్థులై కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువ టెన్త్ ఇంటర్‌తో పాటు డిప్లొమా, పాలిటెక్నిక్, యూజీ పీజీ కోర్సులు అభ్యసిస్తున్నవారు ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
( ఇది కూడా చదవండి…..నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ 2025)
స్కాలర్షిప్ వివరాలు
1వ తరగతి నుంచి 6వతరగతి వరకు రూ.15వేలు, 7వ తరగతి నుంచి 12వతరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.18వేలు, జనరల్ డిగ్రీ వారికి రూ.30వేలు, ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులకు రూ.50వేలు, పీజీ కోర్సులకు రూ.35వేలు, ప్రొఫెషనల్ పీజీ కోర్సులు చదివే వారికి రూ.75వేల స్కాలర్షిప్ అందిస్తారు
సెలెక్షన్ ప్రాసెస్
అభ్యర్థులు అర్హతల ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించి వారి ప్రతిభ అనుసరించి స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు.
ఆసక్తి గల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ https://www.hdfcbankecss.com/ అప్లై చేసేందుకు సెప్టెంబర్ 94 చివరితేది.
HDFC Scholarship 2025: హెచ్డీఎఫ్స్ బ్యాంక్..పేద విద్యార్థులకు రూ.75వేల స్కాలర్షిప్