Trending Posts

IBPS PO Recruitment 2024: 4వేల బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​

IBPS PO Recruitment 2024

IBPS PO Recruitment 2024 : గవర్నమెంట్ బ్యాంకుల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి అదిరిపోయే న్యూస్ ఇది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పీవో, మేనేజ్ మెంట్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయాలని ఐబీపీఎస్ (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌) నిర్ణయించింది. దీని కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన వారందరూ దీనికి అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 4,455 పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఐబీపీఎస్ పేర్కొంది.

ఏ ఏ బ్యాంకుల్లో పోస్టులున్నాయంటే ?

బ్యాంక్ ఆఫ్ ఇండియా (885 పోస్టులు), కెనరా బ్యాంక్ (750 పోస్టులు), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( 2000 పోస్టులు), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (260 పోస్టులు) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (200 పోస్టులు), పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్ (360 పోస్టులు), యూకో బ్యాంక్ (పోస్టుల సంఖ్య పేర్కోలేదు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (పోస్టుల సంఖ్య పేర్కొనలేదు), బ్యాంక్ ఆఫ్ బరోడా (పోస్టుల సంఖ్య పేర్కొనలేదు) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (పోస్టుల సంఖ్య పేర్కొనలేదు), ఇండియన్ బ్యాంక్ (పోస్టుల సంఖ్య పేర్కొనలేదు)

ఇతర ముఖ్యమైన సమాచారం

ఈ పోస్టుల కోసం అప్లయ్ చేసుకున్న అభ్యర్థులకు రెండు దశల్లో పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి, సర్టిఫికెట్లు వెరిఫై చేసుకొని పోస్టింగ్స్ ఇస్తారు. అబ్జెక్టివ్ టైప్ లో ఉండే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో 100 మార్కులు, అబ్జెక్టివ్/డిస్క్రిప్టివ్ టైప్ లో ఉండే మెయిన్స్ ఎగ్జామినేషన్ లో 100 మార్కులు ఉంటాయి.

దరఖాస్తు చివరి తేది : ఆగస్గు 21
క్వాలిఫికేషన్ : ఏదైనా డిగ్రీ
ఏజ్ లిమిట్ : 01-08-2024 నాటికి 30 ఏళ్లకు మించరాదు.
ఫీజు : రూ.850. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు రూ.175
టెస్ట్ లాంగ్వేజ్: హిందీ/ఇంగ్లీష్

పరీక్ష సిలబస్​

  1. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు, క్యాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. 1 ప్రశ్నకు 1 మార్కుకు కేటాయిస్తారు. 60 నిమిషాల సమయం ఉంటుంది. హిందీ లేదా ఇంగ్లీష్ లో పరీక్ష రాయవచ్చు.
  2. మెయిన్స్ ఎగ్జామినేషన్ లో రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 45 ప్రశ్నలు, జీఎస్, బ్యాంకింగ్ అవేర్ నెస్ నుంచి 40 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 35 ప్రశ్నలు, డేటా అనాలిసిస్, ఇంటర్ ప్రెటేషన్ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. మొత్తంగా 155 ప్రశ్నలకు గాను 200 మార్కులు ఉంటాయి. 3 గంటల సమయం కేటాయిస్తారు.200. హిందీ లేదా ఇంగ్లీష్ లో పరీక్ష రాయవచ్చు.

ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ : అక్టోబర్ – 2024

ప్రిలిమ్స్ రిజల్ట్స్ : అక్టోబర్ లేదా నవంబర్ – 2024

మెయిన్స్ ఎగ్జామినేషన్ : నవంబర్ – 2024

మెయిన్స్ రిజల్ట్స్ : డిసెంబర్ – 2024 లేదా జనవరి – 2025

ఇంటర్వ్యూ : జనవరి లేదా ఫిబ్రవరి – 2025

ఆఫీషియల్ వెబ్ సైట్ : https://ibpsonline.ibps.in/crppo14jul24/

ఆఫీషియల్ నోటిఫికేషన్ : https://www.ibps.in/wp-content/uploads/Detailed-Notification_CRP-PO-XIV_final-1.pdf

ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ : అక్టోబర్ – 2024

ప్రిలిమ్స్ రిజల్ట్స్ : అక్టోబర్ లేదా నవంబర్ – 2024

మెయిన్స్ ఎగ్జామినేషన్ : నవంబర్ – 2024

మెయిన్స్ రిజల్ట్స్ : డిసెంబర్ – 2024 లేదా జనవరి – 2025

ఇంటర్వ్యూ : జనవరి లేదా ఫిబ్రవరి – 2025

ఆఫీషియల్ వెబ్ సైట్ : https://ibpsonline.ibps.in/crppo14jul24/

ఆఫీషియల్ నోటిఫికేషన్ : https://www.ibps.in/wp-content/uploads/Detailed-Notification_CRP-PO-XIV_final-1.pdf

Leave a Comment