నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్మీడియేట్, లేదా డిప్లొమా పూర్తిచేసిన పెళ్లికాని యువతీ, యువకులు ఈ పోస్టులకు అప్లై చేసేందుకు అర్హులు.
నోటిఫికేషన్ వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా 01/2027, 02/2027 సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
అర్హతలు
కనీసం 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా ఒకేషనల్ కోర్సులో గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులు, లేదా మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా కలిగి పెళ్లికాని యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 01 డిసెంబర్ 2004 నుంచి మే 31 2009 మధ్య జన్మించి ఉండాలి. ఎత్తు. 157 సెం.మీ ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్
అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించి అందులో మెరిట్ సాధించిన వారిని షార్ట్ లిస్ట్ చేసి రెండో దశలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించిన తుది ఎంపిక చేస్తారు.
అగ్నివీర్ ట్రైనింగ్
ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేల చెల్లిస్తారు. ఇందులో 70 శాతం జీతం చెల్లించి మరో 30 శాతం అగ్నివీర్ కార్పస్ ఫండ్ కు పంపిస్తారు. నాలుగేళ్ల తర్వాత అన్ని కలిపి రూ. 10.04 లక్షలు చెల్లిస్తారు. సర్వీస్ ఉన్నప్పుడు ప్రతియేటా ఇంక్రిమెంట్లు ఉంటాయి.
దరఖాస్తు వివరాలు
అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 04 చివరి తేదీ. ఎంట్రెన్స్ ఎగ్జామ్ మే 2026 లో ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ. 550 చెల్లించాలి.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ https://www.joinindiannavy.gov.in/
అధికారిక నోటిఫికేషన్ కోసం







