తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి 11వతేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన, 15వరకు ఉపసంహరణ చేసుకునే అవకాశం కల్పించారు. ఫస్ట్ ఫేజ్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ జరగనుంది. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఫలితాలను విడుదల చేస్తారు.
‘నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలివే’
1) వయస్సు 21 సంవత్సరాలు నిండాలి
2) మీ ఏరియాలో ఓటరు లిస్టులో ఓటరు గా నమోదై ఉండాలి.
3)SC/ST/BC వారైతే caste certificate జత పరచాలి.
4) ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన డిపాజిట్ చెల్లించాలి
5)నేర చరిత్ర,చర, స్తిర ఆస్తులు, విద్యార్హత లతో కూడిన అఫిడవిటీ ఇద్దరు సాక్ష్యాలతో సంతకం పెట్టించి ఇవ్వాలి.
6) ఎలక్షన్ expenditure maintain చేస్తానని declaration ఇవ్వాలి.
7) ఏ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారో నామినేషన్ పత్రంలో ముందే తెలపాలి, లేకపోతే పార్టీ B పారం ఇచ్చిన పార్టీ గుర్తు రాదు.
8) నామినేషన్ పత్రం లో ఎన్ని పార్టీ పేర్లైన రాయొచ్చు. ఏ పార్టీ B పారం ఇవ్వకపోతే స్వతంత్ర గుర్తు కేటాయిస్తారు.
9)ఏదైతే స్థానం నుంచి పోటి చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటరు మాత్రమే ప్రతిపాదకుడుగా ఉండాలి.
10) నామినేషన్ పత్రం లో:
A)PART1 లొ ప్రతిపాదకుని సంతకం ఉండాలి
B)PART 2 లో అభ్యర్ధి సంతకం ఉండాలి.
C)PART 3 లొ కూడా అభ్యర్ధి సంతకం ఉండాలి.
D)PART 4 లో RO సంతకం ఉండాలి
E)PART 5(Rejected nominations reasons)లొ RO సంతకం ఉండాలి.
F)PART 6 (receipt ) లొ RO సంతకం ఉండాలి.
11) అఫిడవిటీ లో ఇద్దరు సాక్షుల సంతకం మరియు అభ్యర్థి సంతకం ఉండాలీ.
12.Expenditure Declaration లో అభ్యర్థి సంతకం ఉండాలి.