Trending Posts

Navodaya: నవోదయలో 6వతరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

Navodaya admissions 2024

జవహార్​ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను ఆరోతరగతి ప్రవేశాలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం 5వతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.. నోటిఫికేషన్​ పూర్తి వివరాలు..

ఆసక్తి గల విద్యార్థులు ఆన్​లైన్​ ద్వారా సెప్టెంబర్​ 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్​ ఎగ్జామ్​ జనవరి 18, 2025న నిర్వహిస్తారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థలో 5వతరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.

సీట్ల వివరాలు

దేశవ్యాప్తంగా మొత్తం 653 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 13, తెలంగాణలో 9 ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో గరిష్ఠంగా 80 మందికి అవకాశం కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయిస్తారు.

పరీక్షా విధానం

నవోదయ ఎంట్రన్స్​ ఆబ్జెక్టివ్​ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. సమయం 2గంటలు ఉంటుంది. మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌లో 40 ప్రశ్నలు(50 మార్కులు), అర్థమెటిక్‌ టెస్ట్‌, లాంగ్వేజ్‌ టెస్ట్‌ల్లో ఒక్కోదానిలో 20 ప్రశ్నలు(మార్కులు 50) ఉంటాయి. మెరిట్​, రిజర్వేషన్​, గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

Navodaya: నవోదయలో 6వతరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

Leave a Comment