Ration card apply
తెలంగాణాలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జనవరి 26వతేదీ నుంచి ప్రారంభం అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు రేషన్ కార్డుకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? మొత్తం విధివిధానాలకు ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది.
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ 26న ప్రారంభించి అర్హులైన వారికి ఫిబ్రవరి నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే కొత్త రేషన్ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి?, ఎక్కడ అప్లై చేయాలి. అప్లై చేసేందుకు కావాల్సిన పత్రాలు ఏవీ అనే చర్చ ప్రజల్లో నడుస్తుంది.

ఇప్పటి వరకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2.5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల వార్షిక ఆదాయ పరిమితి విధించారు. ఇందుకోసం కొత్త రేషన్ కార్డు కావాల్సిన కుటుంబ యజమాని తప్పనిసరిగా స్థానిక తహసీల్దార్ ఆఫీసు నుంచి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి.
కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ration card application చేసుకునేవారు తప్పకుండా కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు కలిగి ఉండాలి. మరియు వాటి ఫొటోలను అందుబాటులో ఉంచుకోవాలి. వీటితో పాటు వయసు ధృవీకరణ కోసం పిల్లల జనన ధృవీకరణ పత్రాలు దగ్గర పెట్టుకోవాలి.
కొత్త రేషన్ కార్డుల new ration cards ప్రక్రియ జనవరి 26 నుంచి వారం రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి దూర ప్రాంతాల్లో ఉండే వారు సొంత ఊళ్లకు వచ్చి కావాల్సిన పత్రాలను తీసుకోవాలి.
ప్రభుత్వం ఇప్పటికే కుటుంబ సర్వే ద్వారా కుటుంబాల యూనిట్‌గా అన్ని వివరాలను సేకరించింది. అధికారుల సమాచారం మేరకు కుటుంబ సర్వే ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం లేకపోలేదు.
అయితే గత ఏడాది జనవరిలో నిర్వహించి ప్రజా పాలన ద్వారా కొత్తగా 12లక్షలకు పైగా కొత్త రేషన్ కార్దు దరఖాస్తులు వచ్చాయి. వీటిని కూడా ఆమోదిస్తూ.. ఆ సమయంలో దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్తగా జారీ చేసే రేషన్ కార్డులు పూర్తిగా డిజిటల్ కార్డు తరహా ఉండనున్నాయి. వీటిపై రేషన్ కార్డు నంబర్‌తో పాటు కుటుంబ యజమాని పేరు మాత్రమే ఉండనుంది. వీటిపై కుటుంబ సభ్యులు వివరాలు గానీ, ఫొటోలో గానీ ఉండవు. వీటిని స్కాన్ చేస్తే.. రేషన్ షాపుల్లో పూర్తి సమాచారం పొందేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు.
New Ration card:కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేస్తున్నారా..