New ration cards apply in meeseva: మీసేవాలో కొత్తరేషన్‌కార్డు..అప్లై చేయండిలా..
Telangana new ration cards
తెలంగాణాలో కొత్త రేషన్‌కార్డుల జారీపై ప్రభుత్వం శుక్రవారం జరిగిన కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనతో పాటు ఇటీవల జరిగిన గ్రామసభల్లో భారీ సంఖ్యలో వచ్చిన రేషన్‌కార్డుల దరఖాస్తులపై మంత్రివర్గం చర్చజరిపింది. ఈ మేరకు రేషన్‌కార్డు లబ్దిదారులకు శుభవార్త చెప్పింది.
ఇకనుంచి ఆన్లైన్ ద్వారా మీసేవాలో (ration card applications in meeseva) రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించనున్నట్టు ప్రకటన చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. ఫిబ్రవరి 08వతేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు మీసేవాలో అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
మీసేవాలో ఆన్లైన్ రేషన్‌కార్డు meeseva ration card application అప్లికేషన్ ద్వారా కొత్త రేషన్‌కార్డులతో(new ration card application) పాటు పాత రేషన్‌కార్డులో పేర్లు, చిరునామా మార్పు, మరియు పేర్ల తొలగింపు, కొత్త పేర్లు చేర్చడం వంటి ఆప్లన్లను తీసుకువచ్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ డేటాను మీసేవాకు అనుసంధానం చేయాలని మీసేవా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఇక నుంచి రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ మరియు మార్పులు, చేర్పులు అనేది నిరంతర ప్రక్రియ అని ప్రజలు ఆందోళన చేందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే గతంలో ప్రజాపాలన, గ్రామసభల ద్వారా వచ్చిన దరఖాస్తుల డేటా అంతా ప్రభుత్వం దగ్గర ఉందని వారికి కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని ఇప్పటి వరకు అప్లై చేయని వారు మాత్రమే మీసేవా ద్వారా అప్లై చేయాలని ప్రభుత్వం సూచించింది.