GDS postal jobs 2024
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసు సర్కిళ్లలో 44, 228 ఉద్యోగాల భర్తీకి పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి పరీక్ష లేకుండానే కేవలం టెన్త్ క్లాసు మార్కుల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

పోస్టుల వివరాలు
బ్రాంచ్ పోస్టు మాస్టర్
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్
డాక్ సేవక్
దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తులు జూలై 15వ తేదీ నుంచి స్వీకరిస్తారు. చివరి తేదీ ఆగస్ట్ 05. దరఖాస్తుల సవరణకు ఆగస్టు 06 నుంచి 08 వరకు అవకాశం ఉంటుంది.
పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్ క్లాసు పాసై ఉండాలి. వయసు 18సం. నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్ల వయసు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పదో తరగతి మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
Postal jobs: పోస్టల్ శాఖలో 44,228 ఉద్యోగాలకు దరఖాస్తులు