రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు
తెలంగాణ ప్రభుత్వం రూ.6వేల కోట్లతో 5లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు గరిష్టంగా 80శాతం వరకు రాయితీతో రుణాలు ఇచ్చేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర మంత్రులు రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
Apply here
రాజీవ్ యువవికాసం దరఖాస్తులు మార్చి 17 నుంచి ఏప్రిల్ 05వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి దరఖాస్తుల పరిశీలన చేసి జూన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రుణాలకు సంబంధించిన చెక్కులను అందించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామనే హామీని నెరవేర్చే దిశగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ rajiv yuva vikasam scheme apply online
రాజీవ్ యువవికాసం అప్లికేషన్లు మార్చి 17 సాయంత్రం లోగా https://tgobmms.cgg.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. rajiv yuva vikasam scheme eligibility అర్హత కలిగిన అభ్యర్థులు 18–42 ఏళ్లలోపు నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
rajiv yuva vikasam scheme cattegereis
రాజీవ్ యువ వికాసంలో భాగంగా యువతకు రూ. లక్ష నుంచి గరిష్టంగా రూ.3లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారు. ఇందులో 60 నుంచి 80శాతం వరకు సబ్బిడీ ఇవ్వనున్నారు.

Rajiv yuva vikasam scheme: రాజీవ్ యువ వికాసం స్కీమ్ అప్లై