ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి సౌత్ వెస్టర్న రైల్వే శుభవార్త చెప్పింది. సుమారు 910 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్రెంటిస్ ఖాళీలు–అర్హతల వివరాలు
ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్ విభాగాల్లో మొత్తం 910 ఖాళీలున్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 15–24 ఏళ్లలో పు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ100 చెల్లించాలి. విద్యార్థులు అకడమిక్‌లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.