Sankranthi Holidays in Ap
సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గతంలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే తెలంగాణ కంటే అధికంగా విద్యార్థులకు స్కూళ్లకు సెలవులు ఇస్తూ అధికారిక ప్రకటన చేసింది.

ఆంధ్రాలో అతిపెద్ద పండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు. పంటలు సుభిక్షంగా పండి ధాన్యం ఇంటి వచ్చే సమయం కావడంతో ఎంతో సంబురాలతో సంక్రాంతి పండుగను అత్యంత వైభంగా నిర్వహిస్తారు. భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, కనుమ పశువుల పూజలు, కోడి పందాలతో ఆంధ్రా, రాయలసీమ, కోనసీమ ప్రాంతాలన్నీ కోలహాలంగా మారుతాయి. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలంగా సొంత ఊర్లకు చేరుకుంటారు. హైదారబాద్ సిటీలో నివసిస్తున్న ఆంధ్రప్రజలంతా ఊళ్ల బాట పడతారు. దాదాపు సగానికి పైగా పట్టణం ఖాళీ అవుతుంది.
ఈ సందర్భంగా సంక్రాంతి సెలవుల sankranthi holidays కోసం పిల్లలు, పెద్దలు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఏపీలో జనవరి 10తేదీ శుక్రవారం నుంచే పండుగల సెలవులు ప్రారంభం అవుతాయని తిరిగి జనవరి 18న స్కూళ్లు తెరుచుకుంటాయని schools open ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణాలో మాత్రం జనవరి 11 నుంచి 17వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రెండో శనివారం కలిసి రావడంతో ఈసారి కాలేజీలకు sankranthi holidays college కూడా భారీగానే సెలవులు ప్రకటించారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి కావడంతో సంక్రాంతి sankranthi festivel కోలాహాలం ముందుగానే ప్రారంభమైంది.
Sankranthi Holidays 2025: విద్యార్థులకు గుడ్న్యూస్..సంక్రాంతి సెలవులపై ప్రభుత్వ ప్రకటన