Trending Posts

school holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్​..రెండు రోజులు స్కూళ్లకు సెలవులు

2 days school holidays

విద్యార్థులకు గుడ్‌న్యూస్​.. పాఠశాలలకు రెండు రోజులు వరుస సెలవులు(school holidays) రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2025 అకడమిక్​ క్యాలెండర్​ ప్రకారం జులై నెలలో ఆషాడ మాసం రావడంతో ఆషాడ మాసం బోనాల పండుగ bonalu festivel)సెలవును సోమవారం జూలై 21న ప్రకటించింది.

తెలంగాణాలో అత్యంత వైభవంగా బోనాల పండుగను(bonaalu) జరుపుకుంటారు. గత నెల 25వ తేదీ నుంచి ఆషాడ మాసం ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ సంబురాలు జరుగుతున్నాయి. హైదారాబాద్​, సికింద్రాబాద్​, గోల్కొండ, లష్కర్​ బోనాల జాతర ముగిశాయి. కాగా రేపు అనగా జూలై 20 చివరి ఆదివారం కావడంతో బోనాల పండుగ ముగియనుంది.

ఈ బోనాల పండుగను పురస్కరించుకుని సోమవారం జూలై 21న రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా(govt holiday july 21) ప్రకటించింది. దీంతో ఆది, సోమవారం రెండు రోజులు వరస సెలవులు రానున్నాయి. ప్రభుత్వ స్కూళ్లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం వర్తించనుంది.

Leave a Comment