Trending Posts

తెలంగాణాలో 2లక్షల కొత్త పెన్షన్లు..అర్హతలివే..

హైదరాబాద్: తెలంగాణాలో ఎన్నో ఏళ్లుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా సుమారు 2 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ ఈ ఏడాది బడ్జెట్ లో నిధులు కేటాయించింది.

ప్రస్తుత మీ పెన్షన్ స్థితి తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

 2026–27 వార్షిక బడ్జెట్‌లో  రాష్ట్ర ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు సుమారు రూ.14,861 కోట్లను కేటాయించినట్టు ఆర్థిక శాఖా మంత్రి  భట్టి విక్రమార్క వెల్లడించారు.  అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సమయానికి పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ఈ ఏడాది నుంచి కొత్తగా మరో 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ పంచాయతీలో దరఖాస్తులు చేసుకున్న వాటిని పరిశీలించి పెన్షన్లను అందజేస్తామని ప్రకటించింది.   

ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేయూత పెన్షన్లు రూ. 2వేలు, వికలాంగులకు రూ4 వేలు అందిస్తున్నారు. వీటిని త్వరలో పెంపు చేసి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

అర్హతలు

చేయూత పెన్షన్ పథకం అర్హతలు

రాష్ట్ర నివాసి కావాలి: దరఖాస్తు దారుడు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.

ఆర్థిక పరిస్థితి: తెల్ల రేషన్ కార్డు కలిగి పేద మరియు బలహీన వర్గాలకు చెందినవారై ఉండాలి

  • వృద్ధాప్య పెన్షన్: సాధారణంగా 57 సంవత్సరాలు నిండి అంతకంటే ఎక్కువ వయసు వారై ఉండాలి. 
  • వితంతువులు: భర్త మృతి చెందిన మహిళలు అర్హులు.
  • దివ్యాంగులు: ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం  సాధారణంగా 40శాతం పైగా అంగవైకల్యం ఉండాలి.  ప్రమాణాల ప్రకారం అర్హత ఉంటుంది.
  • ఒంటరి మహిళలు: కుటుంబ సహాయం లేకుండా భర్త జీవించి ఉండి దూరంగా ఉంటున్న మహిళలు

 ఇతర ప్రమాణాలు:

  • ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు. వారి కుటుంబ సభ్యుడై ఉండకూడదు.
  • ఆదాయ పన్ను చెల్లించే స్థాయిలో ఆదాయం ఉండకూడదు.
  • ఇతర ప్రభుత్వ పెన్షన్ పొందకూడదు

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/