Telugu rhymes apps
బెస్ట్ నర్సరీ రైమ్స్ యాప్స్
జానీ జానీ.. ఎస్ పప్పా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, రైన్ రైన్ గో అవే అంటూ స్కూళ్లలో నర్సరీ పిల్లలకు రైమ్స్, పాటలు నేర్పిస్తుంటారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో ఇవి ఆన్‌లైన్‌లోనూ వినిపిస్తున్నాయి. పలు వెబ్‌సైట్స్, మొబైల్ యాప్స్ లో యానిమేషన్, గ్రాఫిక్స్ వీడియోలతో లభ్యమవుతూ పిల్లల్లో భాష, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి తోడ్పడుతున్నాయి. పేరెంట్స్ కూడా ప్రతి దశలో పిల్లల ఎదుగుదలకు తీసుకోవాల్సిన చర్యల కోసం ఇంటర్నెట్‌పైనే ఆధారపడుతున్నారు. ఈ తరుణంలో నర్సరీ పిల్లలకు ఆటలు, పాటల రూపంలో రైమ్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్న పలు మొబైల్ యాప్‌లను తరచి చూద్దాం..
ఎదిగే పిల్లల కోసం చుచు టీవీ…
పిల్లల పెంపకంలో మెళకువలు పెంచుకోవడంతో పాటు వారిని ఆడి పాడించడానికి సరికొత్త నర్సరీ రైమ్స్ అందిస్తోంది ChuChu TV Nursery Rhymes యాప్. బాల్యదశలో పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే చక్కని కంటెంట్ ఇందులో ఉంటుంది. ఈ యాప్‌లో వీడియోలను డౌన్‌లోడ్ చేసుకొని ఎప్పుడైనా, ఎక్కడైనా ఏ డివైస్‌లోనైనా చూసే సౌలభ్యం ఉంది. 2 నుంచి 13 సంవత్సరాల వయసు పిల్లలకు ఉపయోగపడేలా రైమ్స్, పాటలు, మ్యాథమెటిక్స్, ఆల్ఫాబెట్స్, డ్యాన్సెస్ వంటి వీడియోలు ఇందులో ఉన్నాయి. పిల్లలు ఎంత సేపు వీడియోలు చూడాలో నిర్ణయించేందుకు ఆటోమేటిగ్గా స్క్రీన్ ఆఫ్ అయ్యేలా ‘వాచ్ టైం కంట్రోల్’ ఆప్షన్ ఉంటుంది. చిన్న పిల్లలు ఫోన్‌ను టచ్ చేయడం వల్ల మధ్యలో డిస్టర్బెన్స్ కాకుండా చైల్డ్ లాక్ సౌలభ్యమూ ఉంది. తల్లిదండ్రుల నియంత్రణలో పిల్లలకు చక్కటి రైమ్స్ నేర్పించడానికి ఉపయోగపడుతున్న యాప్‌లలో ఇది ముందువరుసలో నిలుస్తుంది. జనరల్ ఇంగ్లిష్, అమెరికన్ ఇంగ్లిష్, స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్, తమిళ్ మరియు హిందీ వంటి ఏడు భాషల్లో పాటలు, రైమ్స్ అందించడం దీని ప్రత్యేకత. వీటిని యాపిల్ టీవీ లేదా క్రోమ్‌సెట్‌లోనూ వీక్షించవచ్చు. చుచు టీవీ యాప్‌లో లైట్, ప్రో వర్షన్ యాప్స్ ఉన్నాయి.
యానిమేషన్ వీడియోల కోసం… కిడ్లోల్యాండ్
అబ్బురపరిచే యానిమేషన్ తో వేల సంఖ్యలో నర్సరీ రైమ్స్, పాటలు అందించడం KidloLand – Nursery Rhymes ప్రత్యేకత. ఈ యాప్‌లో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మేరీ హ్యాడ్ ఏ లిటిల్ ల్యాంబ్, ఓల్డ్ మెక్‌డొనాల్డ్, ఇట్సీ బిట్సీ స్పైడర్, వీల్స్ ఆన్ ద బస్ వంటి పాపులర్ రైమ్స్ ఉన్నాయి. నర్సరీ రైమ్స్, ఆల్ఫాబెట్స్, యానిమల్స్, వెహికల్స్, ఫుడ్, టైమ్స్ ఆఫ్ ద ఇయర్ వంటి 16 కేటగిరీల వారీగా విభజించి కంటెంట్‌ను అందిస్తున్నారు. ప్రతి రైమ్ ను అద్భుతంగా ఉండే యానిమేషన్, సౌండ్ ఎఫెక్స్ట్, సంగీతం, స్టైల్‌గా ఉండే కార్టూన్స్ తో తయారు చేయడం వల్ల ఇవి వినసొంపుగా ఉండటంతో పాటు ఆసక్తిని కలిగిస్తాయి. ఈ వయసులో పిల్లలు నేర్చుకోవాల్సిన శబ్దాలను ఇందులో పొందుపరిచారు. ఇందులో పిల్లలు మాట్లాడితే రెస్పాన్స్ వచ్చేలా (ఇంటరాక్టివ్) ప్రోగ్రాంనూ తీర్చిదిద్దారు.
ఎర్లీ లెర్నింగ్‌కు.. స్టోరీ బుక్
ఎర్లీ లెర్నింగ్ కు అద్భుతంగా ఉపయోగపడుతున్న యాప్‌లలో Storybook Rhymes Volume 1 ఒకటి. ఇందులోనూ అబ్బురపరిచే యానిమేషన్ క్యారెక్టర్స్, జోష్ నింపే సంగీతం వంటివి ఉన్నాయి. వన్ టూ, బకిల్ మై షూ, ఇట్సీ బిట్సీ స్పైడర్ వంటి కథలు పిల్లల్లో ఆసక్తి కలిగిస్తాయి. లిరిక్స్, స్క్రిప్ట్స్ సులువుగా అర్థమయ్యేలా ఉంటాయి. కార్టూన్ చిత్రాలు, వాటితో పాటు వచ్చే శబ్దాలు పిల్లల్లో నవ్వును ప్రేరేపిస్తాయి. ఇది నర్సరీ రైమ్స్‌తో పాటు ఆల్ఫాబెట్స్, కలర్స్, ఫ్రూట్స్, షేప్స్, యానిమల్స్ అండ్ సౌండ్స్, నిత్య జీవితంలో ఎదురయ్యే వస్తువుల పేర్లు వంటి దాదాపు 10 రకాల యాప్‌లను వేరువేరుగా అందిస్తోంది. గేమ్స్ సహాయంతో పిల్లలు మొదట వినే పదాలు, వస్తువుల పేర్లను నేర్చుకునేలా ‘లాఫ్ అండ్ లెర్న్.. ఫస్ట్ వర్డ్స్ ఫన్’ అనే యాప్ ను తయారు చేశారు. దీని ద్వారా పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ పెరగడంతో పాటు శరీర కదలికలు మెరుగుపడే అవకాశం ఉందని నిర్వహకులు అంటున్నారు.
గుడ్ హ్యాబిట్స్.. నేర్పించండిలా
చిన్నప్పటి నుంచే మీ పిల్లలకు మంచి అలవాట్లు అలవడాలంటే 100 Top Nursery Rhymes & Videos యాప్ మీ మొబైల్‌లో ఉండాల్సిందే. ఇది దాదాపు 50 కి పైగా మంచి అలవాట్లను యానిమేషన్‌తో కూడిన ఆడియో, వీడియో రూపంలో అందిస్తుంది. ఇవి వినడం, చూడటం వల్ల పిల్లలకు సులువుగా మంచి అలవాట్లు అలవడుతాయి. వీటితో పాటు 100 కు పైగా నర్సరీ రైమ్స్, వందకు పైగా కథలు ఆడియో ఫార్మాట్‌లో, 60 కి పైగా వీడియో రైమ్స్ ఉన్నాయి. ప్రతి రైమ్, కథకు సులభంగా అర్థమయ్యేలా లిరిక్స్, స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇది కూడా పూర్తి ఉచిత కంటెంట్ ను ఆఫ్‌లైన్‌లోనూ అందిస్తుంది. కథలను వినడంతో పాటు చదవవచ్చు.
పాటలు పాడించే.. పింగ్‌ఫాంగ్
యాప్‌లోని యానిమేషన్ క్యారెక్టర్‌లతో పాటు పిల్లలు పాడుతూ, ఆడుతూ నేర్చుకునే యాప్ Pinkfong Songs & Stories. చిన్న చిన్న కథలతో పాటు ఎక్కువసేపు కొనసాగే వీడియోలు ఇందులో ఉంటాయి. ఇది నాలుగు భాషల్లో కంటెంట్ అందస్తుంది. ఐదు సంవత్సరాల లోపు పిల్లలు సులువుగా నేర్చుకొని తిరిగి పాడేలా లిరిక్స్ ఉంటాయి. అబ్బురపరిచే గ్రాఫిక్స్ తో ఆకట్టుకునే యానిమేషన్ క్యారెక్టర్స్ తో వీడియోలుంటాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకొని ఎప్పుడైనా ఎక్కడైనా చూడవచ్చు. దాదాపు వంద నిమిషాల వరకు నాన్‌స్టాప్ ప్లే ఉంటుంది. అయితే ఇందుకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
టాప్ నర్సరీ రైమ్స్ కు బ్యాంక్ ఇది
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కిడ్స్.. ఇలా అందరూ నేర్చుకోవడానికి, నేర్పించడానికి పూర్తి ఉచితంగా రైమ్స్, పాటలు అందిస్తున్న యాప్ Kids Top Nursery Rhymes Videos – Offline Learning. ఆఫ్‌లైన్‌లోనూ వీడియోలు చూసే సౌలభ్యం ఇందులో ఉంది. రైన్ రైన్ గో అవే, రింగా రింగా రోజెస్, ఫైవ్ లిటిల్ బేబీస్, ఓల్డ్ మెక్‌డోనాల్డ్, జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్ వంటి పాపులర్ రైమ్స్ ను ఆకట్టుకునే యానిమేషన్‌తో తీర్చి దిద్దారు. పిల్లలకు కంటికి ఇంపుగా ఉండే గ్రాఫిక్స్, వినసొంపుగా ఉండి ఉత్సాహం కలిగించే సంగీతంతో కూడిన బెస్ట్ యానిమేటెడ్ వీడియోలు ఇందులో ఉంటాయి.
భారతీయ భాషల్లో బెస్ట్ యాప్
తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళ్, కన్నడ, ఇంగ్లిష్ వంటి ఆరు భారతీయ భాషల్లో నర్సరీ రైమ్స్, పాటలు అందిస్తోంది 300 Top Free Nursery Rhymes. త్వరలోనే గుజరాతీ భాషలోనూ రైమ్స్ అందించనున్న ఈ యాప్‌లో ఒక సారి డౌన్‌లోడ్ చేసుకుంటే ఎన్నిసార్లయినా చూడవచ్చు. ఇది కూడా పూర్తిగా ఉచిత కంటెంట్‌ను అందిస్తుంది. ఈజీగా భాష మార్చుకుంటూ రైమ్స్ వినవచ్చు.
ఆఫ్‌లైన్‌లో.. అన్నీ ఉచితంగా
టాప్ రైమ్స్‌ను పూర్తి ఉచితంగా అందిస్తున్న యాప్ kids nursery rhymes in english- offline. ఇందులోని వీడియోలను ఆఫ్‌లైన్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా వినవచ్చు. నర్సరీ కు సంబంధించిన అన్ని రైమ్స్, బేబీ సాంగ్స్ లిరిక్స్ తో పాటు వస్తాయి. ఇందులో ఉండే పేరెంటల్ మోడ్ ఆప్షన్ తో పిల్లలు ఎక్కువసేపు వీడియోలు చూడకుండా నియంత్రించవచ్చు.
E Learning Apps for childrens: పిల్లల కోసం లెర్నింగ్ యాప్స్