TG CET 2025 SCHEDULE
తెలంగాణాలో వివిధ కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. వీటిలో పాటు ఆయా ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను కూడా నియమించింది. ఏప్రిల్ 29 నుంచి మొదలై జూన్ 19 వరకు ఈ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

TG EAPCET 2025- ఏప్రిల్ 29, 30, మే 02 నుంచి 05
TG ECET 2025– మే 12
TG EDCET 2025 – జూన్ 01
TG LAWCET 2025 – జూన్ 06
TG ICET – 2025 – జూన్ 8, 9
TG PGECET-2025 – జూన్ 16, 19
PECET 2025 – జూన్ 11 నుంచి 14
పైన పేర్కొన్న పరీక్షలన్నీ ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్గా నిర్వహించనున్నారు. పీఈసెట్ మాత్రం ఆఫ్ లైన్లో ఓంఎంఆర్ షీట్ ద్వారా నిర్వహిస్తారు.
ఆయా ఎంట్రెన్స్ పరీక్షల అర్హతలు, దరఖాస్తు ఫీజు, మరిన్ని వివరాలకు కింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
TG ENTRANCE EXAMS: టీజీసెట్ 2025 షెడ్యూల్ విడుదల