tg high court notification 2025: తెలంగాణ హైకోర్టులో వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 1673 ఖాళీలు ఉన్నాయి. వీటి వివరాలు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోండి.

పోస్టుల వివరాలు
స్టెనో గ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్; ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, కాపిస్ట్, సిస్టమ్ అనలిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, నాన్ టెక్నికల్, టెక్నికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో నాన్ టెక్నికల్ విభాగంలోనే అత్యధికంగా 1277 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు
పోస్టును బట్టి పదోతరగతి, ఇంటర్, డిగ్రీతో పాటు ఆయా రంగాల్లో పని అనుభవం ఉండాలి. వయసు 18–34 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వయోపరిమితి సడలింపు ఉంటుంది.
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా హైకోర్టు పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలి. పూర్తి వివరాలకు high court job notification 2025ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 08వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. దరఖాస్తులకు చివరి తేది జనవరి 31. ఈ పోస్టులకు పరీక్ష తేది జూన్ నెలలో నిర్వహిస్తారు.
అప్లై చేసేందుకు అఫిషీయల్ వెబ్సైట్ https://tshc.gov.in/