టీచర్ కావాలనుకుంటున్నారా? అయితే మీ కోసం అద్భుత అవకాశం. ఇంటర్ పూర్తయితే చాలు ఈ కోర్సు చేసేందుకు అర్హులు..
తెలంగాణ రాష్ట్రంలో డీఈఎల్‌ఎడీ (D.El.Ed), డీపీఎస్‌ఈ (DPSE) కోర్సుల్లో ప్రవేశాల టీజీ డీఈఈసెట్ పరీక్ష షెడ్యూల్ ను ప్రభుత్వ విడుదల చేసింది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటే డైట్ కాలేజీల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈ కోర్సును గతంలో టీటీసీ (టీచర్ ట్రైనింగ్ కోర్సు)గా పిలిచేవారు. ఈకోర్సు పూర్తి చేసిన వారు ఉప్యాధ్యాయ పోటీ పరీక్షలు రాసేందుకు అర్హత సాధిస్తారు.
కోసం నిర్వహించే TG DEECET–2026 (Telangana Diploma in Elementary Education Common Entrance Test) కు సంబంధించిన పరీక్ష షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ DIETలు మరియు ప్రైవేట్ అన్‌ఏయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థల్లో (మైనారిటీ మరియు నాన్-మైనారిటీ కళాశాలలు సహా) 2026–28 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పించబడతాయి.
ముఖ్యమైన తేదీలు:
- టీజీ డీఈఈసెట్–2026
- కోర్సులు: D.El.Ed మరియు DPSE
- పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- పరీక్ష తేదీలు: 21 మే 2026 & 22 మే 2026
నోటిఫికేషన్ వివరాలు:
TG DEECET–2026 కు సంబంధించిన అర్హత ప్రమాణాలు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, రిజిస్ట్రేషన్ ఫీజు, కీలక తేదీలు మొదలైన పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 2026 చివరి వారంలో విడుదల చేయనున్నట్లు ఐపీఎస్ డీఈఈసెట్ కన్వీనర్ నవీన్ నికోలస్ తెలిపారు.
అధికారిక వెబ్ సైట్ https://deecet.cdse.telangana.gov.in/UI/Dates.aspx
- TG DEECET 2026 exam date
- TG DEECET 2026 notification Telugu
- D.El.Ed entrance exam 2026 Telangana
- DPSE admission 2026 TG
- TG DEECET 2026 latest news
TG DEECET 2026 – Frequently Asked Questions (FAQ)
TG DEECET 2026 అంటే ఏమిటి?
TG DEECET 2026 అనేది తెలంగాణ రాష్ట్రంలో D.El.Ed (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) మరియు DPSE (డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్.
TG DEECET 2026 పరీక్ష తేదీలు ఎప్పుడు?
TG DEECET 2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షలను మే 21, 2026 మరియు మే 22, 2026 తేదీల్లో నిర్వహించనున్నారు.
TG DEECET 2026 ద్వారా ఏ కోర్సుల్లో అడ్మిషన్లు ఉంటాయి?
TG DEECET 2026 ద్వారా క్రింది కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించబడతాయి:
- D.El.Ed (Diploma in Elementary Education)
- DPSE (Diploma in Pre-School Education)






