Trending Posts

TOSS ADMISSIONS 2024: డైరెక్ట్ టెన్త్​, ఇంటర్​ చదవేందుకు దరఖాస్తులు..

Telangana open ssc inter admissions 2024

చదువుకోవాలని ఎంతో కోరికగా ఉన్నా.. వివిధ కారణాల వల్ల చదువు మధ్యలోనే ఆపేసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) అలాంటి వారికి ఓపెన్ విధానలంలో టెన్త్, ఇంటర్ పూర్తి చేసే అవకాశం కల్పించింది. ఈ విధానంలో చదువుకునేందుకు రెగ్యులర్ గా స్కూల్ లేదా కాలేజీకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. చేస్తున్న ఉద్యోగాన్ని లేదా ఏదైనా పనిని వదిలివేయాల్సిన అవసరం ఉండదు. కేవలం సొసైటీ నిర్ణయించిన కొన్ని రోజుల్లో మాత్రమే క్లాస్ లకు వెళ్లి టెన్త్, ఇంటర్ పరీక్షలు రాయవచ్చు. ఇలా పొందిన సర్టిఫికెట్ల ద్వారా పై చదువులు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఓపెన్ పద్దతి ద్వారా పొందిన సర్టిఫికెట్లకు కూడా రెగ్యులర్ విధానంలో పొందిన సర్టిఫికెట్లతో సమాన విలువ ఉంటుంది.

టెన్త్ క్లాస్​ సర్టిఫికేట్​ – అర్హతలు

  1. టెన్త్ క్లాస్ లో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు 2024 ఆగస్టు 31వ తేదీ నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి.
  2. కనీస విద్యార్హతలు ఏమీ లేనప్పటికీ.. పదో తరగతి చదవగలిగే నాలెడ్జ్ ఉండాలి. ఈ విషయంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ.. దానికి సంబంధించిన డాక్యుమెంట్ పై సంతకం చేయాలి.
  3. గతంలో ఏదైనా ప్రైవేవ్ లేదా గవర్నమెంట్ స్కూల్ లో చేరి, తరువాత మానేసి ఉంటే దానికి సంబంధించిన రికార్డు షీట్ లు లేదా టీసీ అందజేయాల్సి ఉంటుంది. ఇందులో విద్యార్థి పుట్టిన తేదీ స్పష్టంగా ఉండాలి.
  4. స్థానిక తహసీల్దార్, లేదా మున్సిపాలిటీ ఆఫీసర్ జారీ చేసే అటెస్టెడ్ కాపీ. అందులో విద్యార్థి పుట్టిన తేదీ స్పష్టంగా పేర్కోవాలి.
  5. స్థానిక తహసీల్దార్, లేదా మున్సిపాలిటీ ఆఫీసర్ జారీ చేసే రెసిడెన్సీ సర్టిఫికెట్ అవసరం.

ఇంటర్ లో అడ్మిషన్ల కోసం కావాల్సిన సర్టిఫికెట్లు – అర్హతలు

  1. విద్యార్థి 2024 ఆగస్టు 31వ తేదీ నాటికి 15 సంవత్సారాలు నిండి ఉండాలి.
  2. తెలంగాణలోని ఏదైనా గుర్తింపు సెకండరీ స్కూల్ బోర్డు ద్వారా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి.
  3. ఇతర రాష్ట్రాల్లో టెన్త్ క్లాస్ పూర్తి చేస్తే, సంబంధిత తహసీల్దార్ లేదా మున్సిపాలిటీ ఆఫీసర్ జారీ చేసే రెసెడెన్సీ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది.
    ఇతర ముఖ్య సమాచారం..
    ఓపెన్ టెన్త్, ఇంటర్ లో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా 5 సబ్జెక్టుల్లో టెన్త్ లేదా ఇంటర్ చదవాల్సి ఉంటుంది. ఒక వేళ విద్యార్థి గతంలో రెగ్యులర్ విధానంలో గానీ ఓపెన్ విధానంలో గానీ టెన్త్ క్లాస్, ఇంటర్ పరీక్షలు రాస్తే అందులో పాసైన ఏవేని రెండు సబ్జెక్టులు బదలాయించుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఐదు సబ్జెక్టులతో పాటు మరి కొన్ని సబ్జెక్టులు చదవాలనుకునే విద్యార్థులకు కూడా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అవకాశం కల్పిస్తోంది. కానీ టెన్త్ క్లాస్ లో ప్రతీ అదనపు సబ్జెక్ట్ కు రూ.200, ఇంటర్ లో అదనపు సబ్జెక్ట్ కు రూ.300 అధికంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఫీజు వివరాలు

  1. టెన్త్ క్లాస్ లో అడ్మిషన్ పొందే విద్యార్థులందరూ ముందుగా రూ.150 అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఉన్న 5 సబ్జెక్టులకు కలిపి జనరల్ కేటగిరీ విద్యార్థులు రూ.1,400, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, స్త్రీలు రూ. 1000 ఫీజు చెల్లించాలి. ప్రతీ అదనపు సబ్జెక్టు రూ.200 చెల్లించాలి.
  2. ఇంటర్ మీడియట్ లో అడ్మిషన్ పొందే విద్యార్థులందరూ ముందుగా రూ.300 అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఉన్న 5 సబ్జెక్టులకు కలిపి జనరల్ కేటగిరీ విద్యార్థులు రూ.1,500, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, స్త్రీలు రూ. 1200 ఫీజు చెల్లించాలి. ప్రతీ అదనపు సబ్జెక్టు రూ.300 చెల్లించాలి.
  3. చివరి తేదీ ముగిసిన తరువాత అప్లయ్ చేసుకునే టెన్త్ క్లాస్ విద్యార్థులు అడ్మిషన్ ఫీజుతో పాటు రూ.100, ఇంటర్ విద్యార్థులు రూ.200 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
  4. ఫీజును ఆన్ లైన్ విధానంలో www.telanganaopenschool.org / TGOnline / Mee Seva ద్వారా మాత్రమే చెల్లించి అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది.

పబ్లిక్ పరీక్షలు

ఓపెన్ టెన్త్, ఇంటర్ లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు సొసైటీ పుస్తకాలు, ఇతర మెటీరియల్ అందిస్తుంది. ఆదివారం, ఇతర సెలవు దినాల్లో క్లాసులు నిర్వహిస్తుంది. వారందరికీ ఏడాదిలో రెండు సార్లు ఏప్రిల్ / మే, అక్టోబర్ / నవంబర్ లో పరీక్షలు జరుపుతుంది. ప్రతీ సబ్జెక్టులో విద్యార్థులు 35 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. పరీక్షలు ముగిసిన ఒకటి లేదా రెండు నెలల్లో ఫలితాలను వెల్లడిస్తుంది.

ముఖ్యమైన తేదీలు

అడ్మిషన్ నోటిఫికేషన్ : 08-08-2024

అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం : 08-08-2024

ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ : 10-09-2024

లేట్ ఫీజుతో చివరి తేదీ : 31-10-2024

అఫీషియల్ వెబ్ సైట్ : https://toss.aptonline.in/TOSS/UI/StudentForms/HomePage.aspx

https://toss.aptonline.in/TOSS/UI/StudentForms/ProspectsTelugu.pdfఅఫీషియల్ నోటిఫికేషన్ :

Leave a Comment