whatsapp governance: ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇన్ని రోజుల వరకు కేవలం మెసేజెస్, వీడీయో, ఆడియో కాల్స్, వాట్సాప్ పేమెంట్స్ కు మాత్రమే పరిమితమైన వాట్సాప్ దేశంలో మొట్టమొదటి సారిగా ప్రభుత్వ సేవలను అందించడానికి సిద్ధమైంది.
తొలి విడతలో APSRTC, CMRF, MUNCIPAL, అన్న క్యాంటీన్, రెవెన్యూ, దేవాదాయతో పాటు 161 సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందనున్నాయి. త్వరలోనే మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాటు నాయుడు తెలిపారు. రేపు లాంఛనంగా వాట్సాప్ గవర్నెన్స్ whatsapp governance కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఈ సౌకర్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా.. జనన, మరణ సర్టిఫికేట్లు ఇతర సేవలు పొందవచ్చు. ఇందుకోసం ప్రత్యేక డేటా ప్రొపైల్ రూపొందించారు. ప్రభుత్వంలోని 40 శాల డేటా వాట్సాప్ గవర్నెన్స్‌కు అనుసంధానించనున్నారు.