Trending Posts

ఫోన్‌పేలో 20,000 నియామకాలు

​వ్యాపార నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేయడంతో పాటు డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామాలకు తీసుకెళ్లేందుకు ఫోన్‌పే ప్రణాళికలు ప్రకటించింది. ఈ విస్తరణ ప్రక్రియలో భాగంగా రాబోయే ఏడాది కాలంలో 20,000 మందికి పైగా ఫ్రంట్‌లైన్ సేల్స్ సిబ్బందిని నేరుగా నియమించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.
​అలాగే వచ్చే 12 నెలల్లో స్మార్ట్‌స్పీకర్లు, పీఓఎస్ (POS) పరికరాలతో కలిపి దాదాపు 50 లక్షలకు పైగా పేమెంట్ పరికరాలను అందుబాటులోకి తేనుంది. వీటిలో సుమారు 50 శాతం పరికరాలను గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయనున్నారు. దీనిద్వారా డిజిటల్ చెల్లింపులను ఆరో అంచె పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ఫోన్‌పే లక్ష్యంగా పెట్టుకుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/