బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (BOI) తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో 205 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
చీఫ్ మేనేజర్: 10
సీనియర్ మేనేజర్: 49
మేనేజర్: 118
ఆఫీసర్: 28
అర్హతలు & విభాగాల వివరాలు:
ఫుల్ స్టాక్ ఇంజినీరింగ్, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్, డేటా ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఐటీ ప్రోక్యూర్మెంట్, డిజిటల్ బ్యాంకింగ్ వంటి విభాగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, లేదా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులకు 01 ఆగస్టు 2026 నాటికి కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఎంపిక విధానం & దరఖాస్తులు:
ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ bankofindia.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 10 సెప్టెంబర్ 2026
చివరి తేదీ: 25 సెప్టెంబర్ 2026 వరకు చేసుకోవచ్చు
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 205 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టులు: సెప్టెంబర్ 10 నుండి దరఖాస్తులు!







