ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) సౌత్ జోన్, చెన్నై కార్యాలయంలో ‘కన్సల్టెంట్ – కంట్రోల్ ఆఫీస్’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్రాంత (రిటైర్డ్) రైల్వే ఉద్యోగుల నుంచి ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హతలు
సంబంధిత విభాగంలో టెన్త్ లేదా డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయస్సు గరిష్ఠంగా 64 ఏళ్ల వరకు ఉండవచ్చు.
వేతనం: పే లెవల్-6, 7, 8, 9 లేదా 10 ఆధారంగా చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక విధానం ఉంటుంది.
దరఖాస్తు విధానం ఈమెయిల్ (teamhrsouthzone@irctc.com) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ 17-09-2026 వరకు చేసుకోవచ్చు.
IRCTC లో కంట్రోల్ ఆఫీస్ కన్సల్టెంట్ పోస్టులు








