Trending Posts

ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల 163 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

​ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 సర్వీసుల కింద వివిధ కేటగిరీల పోస్టుల భర్తీకి 163 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ సర్వీస్‌లో డిప్యూటీ కలెక్టర్లు (11), పోలీస్ సర్వీస్‌లో డీఎస్పీలు (36), అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ (14), డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు (14), డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు (35), మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II (12), డిప్యూటీ రిజిస్ట్రార్ (15) వంటి తదితర 13 సర్వీసులలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
​అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. డీఎస్పీ (కమ్యూనికేషన్స్) పోస్టుకు ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/రేడియో ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.54,060 నుండి రూ.1,54,980 వరకు వేతనం లభిస్తుంది.
​ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది (మొత్తం 825 మార్కులకు). ప్రిలిమినరీ పరీక్షలో పేపర్-I (120 మార్కులు), పేపర్-II (120 మార్కులు) OMR పద్ధతిలో ఉంటాయి; ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. మెయిన్స్ డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఐదు జనరల్ పేపర్లు (ప్రతి పేపర్‌కు 150 మార్కులు) మరియు రెండు క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్ పేపర్లు (తెలుగు, ఇంగ్లీష్) ఉంటాయి. ఇంటర్వ్యూకి 75 మార్కులు కేటాయించారు.
​అర్హులైన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అక్టోబరు 6, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు అక్టోబరు 27, 2026 చివరి తేదీ.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/