పండగ సీజన్, తన ‘బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్’ నేపథ్యంలో 26,000 కి పైగా తాత్కాలిక ఉద్యోగ నియామకాలను చేపట్టినట్లు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ నియామకాలు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
ఈ తాత్కాలిక ఉద్యోగాల్లో 350 కి పైగా దివ్యాంగులకు కేటాయించగా, ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ సిబ్బంది నియామకాల్లో 30 శాతం మంది మహిళలు ఉంటారని తెలిపింది. సార్టింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ వంటి ఉద్యోగాలతో పాటు 8,000 డెలివరీ భాగస్వాములు, 2,700 కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలు ఉన్నాయి.
ఈ అదనపు సిబ్బంది ద్వారా డెలివరీ సామర్థ్యం పెరుగుతుందని, ఎంపిక చేసిన ప్రాంతాల్లో 24-48 గంటల్లో డెలివరీ చేసే ‘ఎం-ఎక్స్‌ప్రెస్’ వంటి వేగవంత సేవలకు వీరు ఉపయోగపడతారని మింత్రా వివరించింది.
మింత్రాలో 26,000 తాత్కాలిక కొలువులు







