AP Anganwadi jobs 2024
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ప్రకటన ద్వారా చిత్తూరు జిల్లాలోని అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అయా అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 87 ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు ఐసీడీఎస్ పీడీ నాగ శైలజ తెలిపారు. ఇందులో అంగన్వాడీ వర్కర్ పోస్టులు 11, మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులు 18, హెల్పర్ పోస్టులు 58 ఉన్నాయి.
https://patashaala.com/tourism-hospitality-management-course
ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు జూలై 19 చివరి తేది. దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో జిల్లా సీడీపీవో కార్యాయలయంలో అందజేయాలి. (దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జులై04వ తేదీ నుంచే ప్రారంభం అయింది.)
అర్హతలు
అభ్యర్థులు 10వ తరగతి పాసై పోస్టు ఖాళీగా ఉన్న ప్రాంతానికి చెందిన మహిళ అయి ఉండాలి. వయసు 21–35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు వయసు మినహాయింపు ఉంటుంది. ఎంపికైన అంగన్వాడీ వర్కర్‌కు రూ.11,500, మినీ అంగన్వాడీ వర్కర్‌కు రూ.7వేలు, హెల్పర్‌కు 7000వేలు వేతనం ఇస్తారు. ఎలాంటి అలవెన్సులు ఉండవు.
ఎంపిక ప్రక్రియ
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ ద్వారా. టెన్త్ ఇతర చదువుల మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు.
కావాల్సిన సర్టిఫికేట్లు
దరఖాస్తులు జిల్లా సీడీపీవో కార్యాలయంలో అందజేయాలి. ఇందుకోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, 10వ తరగతి మెమో, నివాస ధృవపత్రం, వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం, వికలాంగులు అయితే పీహెచ్సీ సర్టిఫికేట్, వితంతువుకు పిల్లలు ఉంటే వారి పుట్టిన ధృవీకరణ పత్రాలు జిరాక్స్ కాపీలు అందజేయాలి.
AP Anganwadi jobs 2024: ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తులు