కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ 2026 సంవత్సరానికి గాను టెక్నికల్, ట్రేడ్స్‌మేన్ గ్రూప్ ‘సి’ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 354 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో వారెంట్ ఆఫీసర్- 129, రైఫిల్‌మ్యాన్- 219, హవిల్దార్- 06 పోస్టులు ఉన్నాయి.
పదో తరగతి (టెన్త్), ఇంటర్మీడియట్, సంబంధిత విభాగాల్లో రెండేళ్ల డిప్లొమా లేదా ITI ఉత్తీర్ణులైన వారు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), వైద్య పరీక్షలు మరియు మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
అర్హత కలిగిన భారతీయ పౌరులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము రూ.100 కాగా, SC/ST మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 28, 2026
చివరి తేదీ: అక్టోబర్ 23, 2026
రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం: నవంబర్ 23, 2026
అస్సాం రైఫిల్స్‌లో 354 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల







