ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏపీ లెజిస్లేచర్ సర్వీసెస్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన ఇంగ్లిష్, తెలుగు రిపోర్టర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 10 ఇంగ్లిష్ రిపోర్టర్స్, 01 తెలుగు రిపోర్టర్ ఖాళీలు ఉన్నాయి.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్/తెలుగు షార్ట్‌హ్యాండ్, టైప్‌రైటింగ్ రెండూ హయ్యర్ గ్రేడ్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. తెలుగు షార్ట్‌హ్యాండ్‌లో 80 wpm ప్రాక్టికల్ టెస్ట్ కూడా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 57,100 నుంచి రూ. 1,47,760 వరకు వేతనం లభిస్తుంది.
ఆన్‌లైన్ రాత పరీక్ష, షార్ట్‌హ్యాండ్ డిక్టేషన్ & ట్రాన్స్‌క్రిప్షన్ టెస్ట్, కంప్యూటర్ ప్రాఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 13 నుంచి నవంబరు 02 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ లెజిస్లేచర్ సర్వీసెస్ లో రిపోర్టర్ పోస్టులు









