సి.ఎస్.ఐ.ఆర్ (CSIR) కి చెందిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NEERI) ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 16 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్-I (05), ప్రాజెక్ట్ అసోసియేట్-II (05), ప్రాజెక్ట్ అసిస్టెంట్ (01), ప్రాజెక్ట్ అసిస్టెంట్-II (02), మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో (03) పోస్టులు ఉన్నాయి.
అర్హత & జీతం: పోస్టును బట్టి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. నెలకు రూ. 18,000 నుండి రూ. 37,000 వరకు జీతం చెల్లిస్తారు. గరిష్ఠ వయోపరిమితి 30 నుండి 35 ఏళ్లు.
స్క్రీనింగ్ మరియు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 14, 2026 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
నీరి (NEERI)లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీ







