జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థ నలంద విశ్వ విద్యాలయం ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, పీ హెచ్ డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. భారత్ తో పాటు 18 దేశాల విద్యార్థులకు అవకాశం ఉంది. బీహార్ లో రాజ్ గిరిలో ఏర్పాటు చేసారు. ఎంఏ, ఎంబీఏ, ఎమ్మెస్సీ, పీహెచ్ డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 55 శాతం మార్కులతో ఏదైనా యూజీ విద్యార్హతతో పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీఏ కు క్యాట్, ఎక్స్‌ఏటీ, మ్యాట్ ఎందులోనైనా స్కోర్ ఉండాలి. పీహెచ్డీ కి పీజీ లో 65 శాతం మార్కులు ఉండాలి. బోధన మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఆగస్టులో క్లాసులు ప్రారంభం అవుతాయి. పీజీ రెండేళ్లు, పీ హెచ్ డీ నాలుగేళ్లు. పీ హెచ్ డీ చేసే వారికి నెలకు రూ. 35,000 స్టైఫండ్ వస్తుంది. ఎంబీఏ కోర్స్ ఫీజు రూ. 2. 22 లక్షలు. మిగిలిన పీజీలకు రూ. 1. 34 లక్షలు. పీహెచ్డీ చేసే వారికి రూ. 3. 67 లక్షలు. వసతి, భోజనం విడిగా చెల్లించాలి. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30. దరఖాస్తు ఫీజు రూ. 500.
: 250 పదాల్లో స్టేట్ మెంట్ ఆఫ్ పర్సన్, 100 పదాల్లో నలందలో ఎందుకు చదవాలనుకుంటున్నారో, 300 నుంచి 500 పదాల్లో సంబంధిత కోర్సును ఎందుకు ఎంచుకుంటున్నారో రాయాలి. పూర్తి వివరాలు https:// nalandauniv. edu. in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
నలంద విశ్వ విద్యాలయంలో పీజీ, పీహెచ్ డీ ప్రవేశాలు..







