Trending Posts

SIDBI లో ప్రాజెక్ట్ మేనేజర్, కోఆర్డినేటర్ ఉద్యోగాలు

​స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) గ్రీన్ క్లైమేట్ ఫైనాన్స్ వర్టికల్ (GCFV) విభాగంలో ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రాజెక్ట్ మేనేజర్ (01), ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (01) పోస్టులు ఉన్నాయి.
​గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్, ఫైనాన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, సస్టెైనబిలిటీ, క్లైమేట్ ఛేంజ్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల వయోపరిమితి 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హతల పరిశీలన, రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
​ఆసక్తి ఉన్న అభ్యర్థులు gcfv@sidbi.in ద్వారా ఇమెయిల్ రూపంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 1, 2026. మరిన్ని వివరాలకు https://www.sidbi.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/