Trending Posts

అస్సాం రైఫిల్స్‌లో 354 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

​కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ 2026 సంవత్సరానికి గాను టెక్నికల్, ట్రేడ్స్‌మేన్ గ్రూప్ ‘సి’ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 354 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో వారెంట్ ఆఫీసర్- 129, రైఫిల్‌మ్యాన్- 219, హవిల్దార్- 06 పోస్టులు ఉన్నాయి.
​పదో తరగతి (టెన్త్), ఇంటర్మీడియట్, సంబంధిత విభాగాల్లో రెండేళ్ల డిప్లొమా లేదా ITI ఉత్తీర్ణులైన వారు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
​డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), వైద్య పరీక్షలు మరియు మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
​అర్హత కలిగిన భారతీయ పౌరులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము రూ.100 కాగా, SC/ST మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
​దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 28, 2026
​చివరి తేదీ: అక్టోబర్ 23, 2026
​రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం: నవంబర్ 23, 2026

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/