ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) కు సంబంధించి ముఖ్యాంశాలతో ఒక వెబ్‌నోట్ విడుదల చేసింది. స్థానికతకు సంబంధించిన వివరాల నమోదులో కొన్ని మార్పులు చేసినట్లు కమిషన్ వెల్లడించింది. అభ్యర్థులు తమ చదువు, నివాసం, జిల్లా, జోన్, మరియు మల్టీజోన్ వివరాలను సరిచూసుకోవాలని సూచించింది.
అభ్యర్థులు నేటి నుంచే తమ OTR వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. దరఖాస్తుదారులు సమాచారాన్ని సమర్పించేటప్పుడు పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలని కోరింది. ఒకవేళ తప్పుడు వివరాలు ఇస్తే నిబంధనల ప్రకారం అభ్యర్థిత్వం తిరస్కరించే (రిజెక్ట్ అయ్యే) అవకాశం ఉందని APPSC హెచ్చరించింది.
OTR అప్‌డేట్.. APPSC అభ్యర్థులకు అలర్ట్







