DXC టెక్నాలజీ సంస్థ తమ CSR కార్యక్రమంలో భాగంగా “DXC Progressing Minds Scholarship for Graduation Students in STEM 2026-27” కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) విభాగాల్లో అండర్‌గ్రాడ్యుయేషన్ చదువుతున్న మహిళా, ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ఒక్కసారిగా రూ.50,000 ఆర్థిక సహాయం అందిస్తారు.
STEM కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ చదువుతున్న మహిళలు, ట్రాన్స్జెండర్లు అర్హులు.
గత సెమిస్టర్ లేదా సంవత్సరంలో కనీసం 60% మార్కులు లేదా సమానమైన గ్రేడ్ సాధించి ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.4 లక్షలకు మించకూడదు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.b4s.in/yeks/DXCS8 లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 15 అక్టోబర్ 2026.
STEM చదివే విద్యార్థినులకు DXC స్కాలర్షిప్: రూ.50 వేల ఆర్థిక సాయం!







